బైకర్ పై ఊడిపడినరెయిన్ వాటర్ వెంట్ పైప్..షేక్‌‌పేట్ ఫ్లైఓవర్‌‌ వద్ద ఘటన 

బైకర్ పై ఊడిపడినరెయిన్ వాటర్ వెంట్ పైప్..షేక్‌‌పేట్ ఫ్లైఓవర్‌‌ వద్ద ఘటన 
  • హెల్మెట్​ ధరించి ఉండటంతో తప్పిన ప్రాణాపాయం

మెహిదీపట్నం, వెలుగు: షేక్‌‌పేట్ ఫ్లైఓవర్ మెయింటెనెన్స్‌‌లో జీహెచ్‌‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. శుక్రవారం బ్రిడ్జి పైనుంచి ఒక్కసారిగా భారీ రెయిన్ వాటర్ వెంట్ పైప్​ఊడి, రోడ్డుపై వెళ్తున్న బైకర్​పై పడింది. అతను హెల్మెట్ ధరించి ఉండటంతో అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కానీ, స్కూటీ కొనుగోలు చేసి 15 రోజులే అయిందని, వాహనం ముందు భాగం నుజ్జునుజ్జయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

గతంలో కూడా ఈ ఫ్లైఓవర్‌‌ పైనుంచి పైప్​లు ఊడిపడ్డాయని, పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించలేదని స్థానికులు, వాహనదారులు ఆరోపించారు. నగరంలో బ్రిడ్జిల కింద నుంచి వెళ్లాలంటేనే భయాందోళన చెందుతున్నామని, ఇప్పటికైనా అధికారులు అన్ని ఫ్లైఓవర్ల వెంట్ పైప్​లను తనిఖీ చేయాలని డిమాండ్​చేశారు. కాగా, ఈ ఘటనపై ఫిల్మ్‌‌నగర్ పోలీస్ స్టేషన్‌‌కు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు.